హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు... కామారెడ్డి జిల్లా కోర్టు తీర్పు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు... కామారెడ్డి జిల్లా కోర్టు తీర్పు

కామారెడ్డి టౌన్, వెలుగు:  హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు,  రూ. 2 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి సీహెచ్ వీఆర్ఆర్​వరప్రసాద్​ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ రాజేష్​ చంద్ర తెలిపిన ప్రకారం.. జిల్లాలోని సదాశివనగర్​మండలంలో హైవేపై కల్వర్టు కింద 2020 జూలై 10న ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. వెళ్లి కేసు నమోదు చేసి మృతుడిని సదాశివనగర్​కు చెందిన మాడల సతీశ్​గా గుర్తించారు. 

కాగా.. మద్నూర్ మండలానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తితో కలిసి సతీశ్​సదాశివనగర్​ వైన్స్​లో మందు తాగుతుండగా గొడవ జరిగింది. దీంతో సతీశ్​ను చంపేందుకు నిర్ణయించుకుని రవికుమార్​ఆర్మూర్​వైపు వెళ్దామని నమ్మించి మర్కల్​క్రాస్ రోడ్డు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కల్వర్టుపై కూర్చున్న సతీష్​ను రవికుమార్​కిందకు తోశాడు. గాయాలైన అతడిపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన రవికుమార్​అలియాస్​రవిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. వాదోపవాదాల అనంతరం రవికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.