
- స్పీడప్చేసిన అధికారులు
- కామారెడ్డి జిల్లాలో 3 నెలల్లో 1,711 కనెక్షన్లు మంజూరు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో అగ్రికల్చర్కరంట్ కనెక్షన్లు వెంట వెంటనే శాంక్షన్అవుతున్నాయి. కరంట్ కనెక్షన్లకు రైతులు నెలల తరబడి ఎదురు చూడకుండా ప్రభుత్వం దృష్టిపెట్టి వెనువెంటనే అనుమతిస్తోంది. ఫలితంగా లోవోల్టేజీ సమస్య లేకుండా కరంట్ సప్లయ్ జరుగుతోంది. గతేడాది కాలంగా జిల్లాలో 4,294 కనెక్షన్లు ఇస్తే.. గడిచిన 3 నెలలల్లోనే కొత్తగా 1,711 కనెక్షన్లు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయానికి యోగ్యమైన భూమి 5.40 లక్షల ఎకరాలు.
సాగు నీటి ప్రాజెక్టులు అంతగా లేని ఈ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు బోరు బావులే దిక్కు. ఎండాకాలంలో అగ్రికల్చర్బోర్ల వినియోగం అధికంగా ఉంటుంది. అయితే గతంలో వ్యవసాయ కరంట్ కనెక్షన్లు కోసం రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. బోర్లు తవ్వించి డీడీలు చెల్లించి సంబంధిత అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కనెక్షన్లు శాంక్షన్చేయాలంటూ రైతులు రోడ్డెక్కిన సందర్భాలున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న అప్లికేషన్లలో 20 శాతం కోటా కూడా రిలీజ్అయ్యేది కాదు.
ఇప్పుడు కోటాకు మించి కనెక్షన్లు
కాంగ్రెస్ప్రభుత్వంలో ఆ పరిస్థితి మారింది. అప్లికేషన్లు నెలల తరబడి పెండింగ్లేకుండా అధికారులు చూస్తున్నారు. ఇప్పుడు కోటాకు మించి కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. బోరు తవ్విన తర్వాత రైతులు డీడీ చెల్లించి అన్లైన్లో అప్లయ్ చేసుకోగానే.. ఎన్పీడీసీఎల్అధికారులు పరిశీలించి క్షేత్ర స్థాయి అధికారులతో ఎస్టిమేషన్వేస్తున్నారు. ఆ తర్వాత కనెక్షన్శాంక్షన్చేస్తున్నారు. ఫలితంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటవుతున్నాయి. 33/11 కేవీ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు.
లోవోల్టేజీ సమస్య తీరి అగ్రికల్చర్కు నాణ్యమైన కరంట్ సప్లయ్అవుతోంది. జూలై 2024 నుంచి ఈ ఏడాది జూన్వరకు కొత్తగా 4,294 అగ్రికల్చర్కరంట్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్నుంచి 3 నెలల కాలంలో కొత్తగా 1,711 కనెక్షన్లు శాంక్షన్చేశారు. అప్లికేషన్ల సంఖ్యకు అనుగుణంగా సంస్థ ఆయా జిల్లాలకు కనెక్షన్ల టార్గెట్ ఇస్తుంది. ఏప్రిల్, మే నెలలో టార్గెట్కంటే ఎక్కువగా కనెక్షన్లు ఇచ్చారు.