బ్రిడ్జిల దగ్గర బీటీ రోడ్డు వేయక ఇబ్బందులు

బ్రిడ్జిల దగ్గర బీటీ రోడ్డు వేయక ఇబ్బందులు

కామారెడ్డి, వెలుగు : తాడ్వాయి, రాజంపేట మండలాల్లోని  పలు చోట్ల నిర్మించిన కల్వర్టుల దగ్గర బీటీ రోడ్లు వేయక  ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  తాడ్వాయి మండలం బ్రహ్మణ్​పల్లి,  సంగోజివాడి సమీపంలో  పలుచోట్ల చిన్న బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 

 పనులు కంప్లీట్​ అయి నెలలు గడుస్తున్నా   బీటీ  రోడ్డు వేయక వెహికల్స్​పై వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు.  రాజంపేట మండలం  ఆర్గొండ, ఎల్లారెడ్డిపల్లి శివారుల్లో  బ్రిడ్జిల నిర్మాణ పనులు కంప్లీట్ అయినప్పటికీ రోడ్డును అనుసంధానం చేస్తూ బీటీ రోడ్డు వేయలేదు.  ఆర్అండ్​బీ అధికారులు స్సందించి  బ్రిడ్జిల దగ్గర బీటీ రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు.