V6 News

కేంద్ర మంత్రిని కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

 కేంద్ర మంత్రిని కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డిటౌన్​, వెలుగు : ఢిల్లీలో  కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్​ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం కలిశారు.  కామారెడ్డిలో  నిర్మాణం చేపట్టాల్సిన ఆర్వోబీలు, పుట్​ ఓవర్​ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు.   జిల్లా కేంద్రంలో 3 ఆర్వోబీలు ( రోడ్​ ఓవర్​ బ్రిడ్జి), ఒక పుట్​ ఓవర్​ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. 

 స్నేహపూరి కాలనీ నుంచి  కలెక్టర్ ఆఫీసు రోడ్డు, వికాస్​ నగర్ నుంచి ఇస్లాంపురా కాలనీ, పాత రాజంపేట రైల్వే గేట్ వద్ద ఆర్వోబీలు,   ప్రియా టాకీసు రోడ్డు నుంచి ఇందిరా చౌక్​ వరకు రైల్వే స్టేషన్ మీదుగా ఫుట్ ఓవర్​ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్నారు.  జిల్లా కేంద్రంలో పెరిగిన ట్రాఫిక్​కు అనుగుణంగా ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని  కేంద్ర మంత్రికి విన్నవించారు.   మంత్రి సానుకూలంగా స్పందించారని,  త్వరలో రైల్వే అధికారులు  స్థల పరిశీలన చేయాలని మంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు.