
- కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, వెలుగు : విద్యార్థులకు చదువుతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు కూడా ముఖ్యమని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ స్కూల్లో 3 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ర్ట స్థాయి గణిత, సంస్కృతి విజ్ఞాన మేళా ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరైన మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు శిశు మందిర్ స్కూల్ పెట్టింది పేరన్నారు. తోటి వారికి సహాయం చేసే గుణాన్ని విద్యార్థులు చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ చదువు చాలా ముఖ్యమని, చదువు కుంటేనే ఏదైనా సాధించగలమన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల గణితం ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వక్త అర్ధచంద్ర ప్రకాశ్‌రెడ్డి, శ్యామ్సుంధర్, గంగారెడ్డి, నల్లన్ చక్రవర్తుల కృష్ణామాచార్యులు, ఆర్.హరిస్మరన్రెడ్డి, శంకర్, రాజిరెడ్డి, రణజిత్‌మోహన్, మల్లేశ్ యాదవ్, ప్రతాప్‌గౌడ్, శ్రీనివాస్, నాగభూషణం పాల్గొన్నారు.