కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

కామారెడ్డి టౌన్, వెలుగు : ఇటీవల అపరేషన్ కగార్​లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ఫారెస్టు ఏరియాలో కుంబింగ్​ నిర్వహిస్తుండగా మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో మృతి చెందిన కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని  ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పరామర్శించారు.   పాల్వంచ మండల కేంద్రానికి వెళ్లి బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.