
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి వరల్డ్ క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. ఎయిడ్స్, హెచ్ఐవీ బారిన పడి చనిపోయిన బాధితుల స్మారకార్థం ప్రతి ఏటా మే 3వ ఆదివారం వరల్డ్ క్యాండిల్ డే నిర్వహిస్తున్నారు.
గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇందిరా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హెల్త్ మిషన్ డీపీఎం పద్మజా, ఏఆర్టీ డాక్టర్లు స్నేహ, ప్రతికమల, ఏఆర్టీ కౌన్సిలర్లు నాగరాజు, గోపాల్, ఐఎస్ఆర్డీ ప్రతినిధి రాజేందర్, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.