ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర
  • కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, ఎస్పీ రాజేశ్​చంద్ర

కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​, ఎస్పీ రాజేశ్​​ చంద్ర పేర్కొన్నారు.  బుధవారం  కలెక్టరేట్​లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. నామినేషన్ల స్వీకరణకు 213 మంది ఆఫీసర్లను నియమించామన్నారు. రిటర్నింగ్​ అధికారులుగా  640 మంది వరకు నియమించామన్నారు.   ప్రిసైడింగ్ అధికారులు 2,869 మంది, ఇతర  పోలింగ్ అధికారులు 3,771 మందిని నియమించినట్లు తెలిపారు.  క్రిటికల్ పోలింగ్​ కేంద్రాలు 223, సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలు  557 ఉన్నాయన్నారు.  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో  వెబ్​కాస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. 

సమస్యాత్మక కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు ఉంటారన్నారు. జిల్లాస్థాయిలో  ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు.  అడిషనల్ కలెక్టర్​ ( రెవెన్యూ) చైర్మన్​గా ఈ కమిటీ ఉంటుందని, ఇందులో మెంబర్లుగా ముగ్గురు జిల్లాస్థాయి అధికారులు ఉంటారన్నారు.  కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం మానిటరింగ్ చేస్తారని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తారన్నారు. 

అడిషనల్ కలెక్టర్​తో పాటు సిబ్బంది ఉంటారన్నారు. పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిశీలనకు జిల్లాస్థాయిలో  నోడల్​ అధికారి ఉంటారని,  ప్రతి మండలానికి ఒక అధికారి ఉంటారని తెలిపారు.  ఫ్లయింగ్​ స్వ్కాడ్ ఉంటుందన్నారు. అంతర్​ జిల్లా సరిహద్దులో లిక్కర్​, నగదు అక్రమ రవాణా కాకుండా 5 టీమ్​లను ఏర్పాటు చేశామన్నారు.  మీడియా మానిటరింగ్​ కమిటీ పోటీ చేసే అభ్యర్థుల ప్రచార వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నట్లు 
తెలిపారు.