కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇన్స్రెన్స్ చెక్కులు

కానిస్టేబుళ్ల కుటుంబాలకు  ఇన్స్రెన్స్ చెక్కులు

కామారెడ్డిటౌన్​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో విధి నిర్వహణలో  భాగంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన  ఇద్దరు కానిస్టేబుల్​ కుటుంబ సభ్యులకు  ఎస్​బీఐ పోలీసు సాలరీ ప్యాకేజీ కింద ఒక్కో ఫ్యామిలీకి రూ. కోటి ఇన్సురెన్స్​ చెక్​లను సోమవారం ఎస్పీ రాజేశ్​ చంద్ర, బ్యాంక్​ అధికారులు అందించారు. 

ఈ ఏడాది మార్చిలో గాంధారిలో కానిస్టేబుల్​ వడ్ల రవికుమార్,  ఏప్రిల్​లో పిట్లంలో కె.బుచ్చయ్య చారి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వీరి కుటుంబీలకు రూ. కోటి చొప్పున ఇన్స్​రెన్ప్​ చెక్​లను అందించారు.  అడిషనల్​ ఎస్పీ నరసింహారెడ్డి,  ఏవో  లింగనాయక్​,  పర్యవేక్షణ అధికారి  జమీల్​అలీ పాల్గొన్నారు.