చైనా మాంజా అమ్మకాలు నిషేధం : ఎస్పీ రాజేశ్చంద్ర

 చైనా మాంజా అమ్మకాలు నిషేధం : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డి, వెలుగు : చైనా మాంజా అమ్మకాలు పూర్తిగా నిషేధమని, నైలాన్​ దారాలు ప్రాణాంతకమని, సాధారణ దారాలతోనే పతంగులు ఎగుర వేయడం సురక్షితమని ఎస్పీ రాజేశ్​చంద్ర సూచించారు.  శుక్రవారం జిల్లావ్యాప్తంగా పతంగులు అమ్మే షాపులు, ఇతర షాపులు కలిపి 157 చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  చైనా మాంజాతో పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. వెహికల్స్​పై వెళ్లే వాళ్లకు, పక్షులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. కరెంట్​ స్తంభాలకు దూరంగా, బహిరంగ ప్రదేశాల్లో పతంగులు ఎగురవేసుకోవాలన్నారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మినా, నిల్వ ఉంచినా పోలీస్​ కంట్రోల్ రూమ్​ నం. 8712686133కి సమాచారం ఇవ్వాలని సూచించారు.