అర్హులకు పథకాలు అందేలా చూడండి : స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ

అర్హులకు పథకాలు అందేలా చూడండి : స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ

నిజామాబాద్, వెలుగు : అర్హులైన మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపాలని స్టేట్​ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ కోరారు. మంగళవారం నిజామాబాద్​లో కలెక్టర్​ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్యతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.  మైనారిటీ విద్యా సంస్థలో వంద శాతం అడ్మిషన్లు జరిగేలా ప్లాన్ చేయాలన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తదితరులు ఉన్నారు.

పుష్కరాల కోసం 15 ఘాట్​లు వచ్చే ఏడాది జిల్లాలో జరిగే గోదావరి పుష్కరాల కోసం 15 చోట్ల ఘాట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.  భక్తులు పుణ్యస్నానాలు చేసే కందకుర్తి, తాడ్​బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్ పాకల, దోమ్ చంద, గుమ్మిర్యాల తదితర 15 ప్రాంతాలను గుర్తించామన్నారు. సీపీ సాయిచైతన్య, అడిషనల్​కలెక్టర్ కిరణ్​కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్​​ తదితరులు ఉన్నారు. 

కామారెడ్డి కలెక్టరేట్​లో... 

కామారెడ్డి : అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని స్టేట్ మైనార్టీ  కమిషన్​చైర్మన్ తారిక్ అన్సారీ అధికారులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్​లో కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  మైనార్టీ సంక్షేమ పథకాలు,  అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. బాన్సువాడలో ఇటీవల జరిగిన సంఘటనపై  చర్చించారు.  బాన్సువాడలో శాంతి భద్రతలను నెలకొల్సిన అధికారులు, పోలీసులను అన్సారీ అభినందించారు.  అడిషనల్ కలెక్టర్​ విక్టర్​, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు ఉన్నారు.