- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిని స్పోర్ట్స్హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రూ.8.90 కోట్లతో చేపట్టనున్న ఇండోర్‌స్టేడియం, ఇతర పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. అభివృద్ధి పనులతో స్టేడియంలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో రానున్నాయని తెలిపారు.
గ్రామీణ క్రీడకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా వారిని వెలుగులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని 39, 40 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా లైబ్రరీ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ఇప్ప ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
