
- 33/11 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థల సేకరణ
- ఈ నెలాఖరులోగా పూర్తి కానున్న టెండర్ల ప్రక్రియ
- సుమారు రూ. 3.50 కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణం
- ఇప్పటికే పట్టణంలో అదనపు ట్రాన్స్ ఫార్మర్లు
- మెరుగైన విద్యుత్తు సరఫరాకు జిల్లా యంత్రాంగం చర్యలు
కామారెడ్డి, వెలుగు : విద్యుత్తు ఓవర్ లోడ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు అవుట్ డోర్ సబ్ స్టేషన్లు ఉండగా, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటు కానున్నది. ఇప్పటికే స్థలాన్ని కేటాయించగా, ఈ నెలాఖరులోగా మంజూరై టెండర్ల పక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలతోపాటు, టౌన్ కలిపి 33/11 కేవీ సబ్స్టేషన్లు 5 ఉన్నాయి. టెకిర్యాల్ సమీపంలో, సిరిసిల్లా రోడ్డు, హౌజింగ్, కలెక్టరేట్ సమీపంలో, కాకతీయ నగర్ కాలనీలో సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఎండాకాలంలో కరెంట్ సప్లయ్‌లో అంతరాయం ఏర్పడుతోంది. లోడ్ తట్టుకునేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఒక సబ్‌స్టేషన్ పరిధిలో సమస్య ఏర్పడితే మరో సబ్ స్టేషన్ నుంచి లోడ్ తీసుకొని పవర్ సప్లయ్ చేస్తున్నారు.
ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటుతో..
జిల్లా కేంద్రం బిజినెస్ ఏరియా కావడంతో విద్యుత్వినియోగం అధికంగా ఉంటుంది. లోడ్ అధికమైనప్పుడు ట్రిప్పై సమస్య ఏర్పడుతుండడంతో మరో 33/11 కేవీ ఇండోర్సబ్స్టేషన్కు అధికారులు ప్రపోజల్ పెట్టారు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి పట్టణం మధ్యలో ఎకరం స్థలం దొరకటం కష్టంగా మారింది. పాత తహసీల్దార్ ఆఫీసు వద్ద 4 గుంటల భూమిని ఎన్పీడీసీఎల్ అధికారులు కేటాయించగా, ఉన్నతాధికారులు పరిశీలించారు. పక్రియ అంతా పూర్తి కాగా, ఈ నెలాఖరుగా మంజూరు కావడంతో పాటు టెండర్ల పక్రియ కంప్లీట్ కానున్నది.
సబ్స్టేషన్నిర్మాణానికి సుమారు రూ. 3 కోట్ల నుంచి రూ. 3.50 కోట్ల వరకు ఖర్చు కానుంది. నార్మల్ సబ్ స్టేషన్ కంటే రూ.కోటి వరకు అదనంగా ఖర్చవుతోంది. ఇండోర్ సబ్ స్టేషన్‌ను తక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తారు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు మాత్రం బయట ఉంటాయి. మిగతా ఎక్విప్ మెంట్స్ ఇండోర్‌లో ఉంటాయి. టౌన్ మధ్యలో నుంచి ఏ సబ్ స్టేషన్ పరిధిలో ప్రాబ్లమ్ వచ్చినా ఇక్కడి నుంచి సప్లయ్ చేయవచ్చు. ప్రత్యేకంగా లైన్లు వేయాల్సిన అవసరం ఉండదు.
తీరనున్న విద్యుత్తు లోడ్ సమస్య..
ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో జిల్లా కేంద్రంలో విద్యుత్తు ఓవర్‌లోడ్ సమస్య తీరనున్నది. సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలనతో పాటు, ఇతర పక్రియలు పూర్తి అయ్యాయి. జిల్లా కేంద్రం మధ్యలో ఏర్పాటు కానుండడంతో నాణ్యమైన కరెంట్ సరఫరా కానుంది.
శ్రావణ్‌కుమార్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ కామారెడ్డి