కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు అట్టహాసంగా రుణాల పంపిణీ

కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు అట్టహాసంగా రుణాల పంపిణీ
  • 4 నియోజకవర్గాల్లో రూ. 10 కోట్ల 92 లక్షలు చెక్కుల అందజేత

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు రెండో విడతగా వడ్డీ లేని రుణాల పంపిణీ  మంగళవారం అట్టహాసంగా జరిగింది. 4  నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చెక్కులను అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో 3,506 సంఘాలకు రూ.3 కోట్ల 25 లక్షలు పంపిణీ చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​గౌడ్​, అడిషనల్ కలెక్టర్, డీఆర్డీవో పాల్గొన్నారు. 

బాన్సువాడ నియోజకవర్గంలో 1,295 సంఘాలకు రూ.  కోటి 13 లక్షలు వచ్చాయి. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి, అగ్రోస్ చైర్మన్​ కాసుల బాల్​రాజు,  సబ్​ కలెక్టర్​ కిరణ్మయి కలిసి  సంఘాల ప్రతినిధులకు చెక్కులను అందజేశారు.  ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని సంఘాలకు  రూ. 3 కోట్ల 78 లక్షల చెక్కులను అందజేయగా, గాంధారి మండల కేంద్రంలో  ఎమ్మెల్యే మదన్మోహన్​రావు, కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ చెక్కులను అందజేశారు. జుక్కల్ నియోజకవర్గంలో  3,241 సంఘాలకు రూ.2 కోట్ల 76 లక్షలు వచ్చాయి.