- కమ్మ సామాజిక వర్గం ప్రకటన
- సీఎం రేవంత్‌ను కలిసిమద్దతు తెలిపిన నేతలు
- అమీర్‌పేట్ మైత్రీ వనంలోఎన్టీఆర్ విగ్రహంఏర్పాటు చేయాలని వినతి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కమ్మ సామా జిక వర్గం నేతలు ప్రకటించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద ర్భంగా తమ సపోర్ట్ కాంగ్రెస్‌కే ఉంటుందని వెల్ల డించారు. అమీర్‌పేట్ మైత్రీ వనంలో మాజీ సీఎం ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తిచేశారు. నామినేటెడ్ పదవుల్లో తమ సామాజికవర్గానికి తగిన ప్రాధా న్యత కల్పించాలని కోరారు.
కమ్మ సంఘాలనాయకుల విజ్ఞప్తులపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూ లంగా స్పందించారు. వారి వెంట మంత్రులు తుమ్మ ల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లి ఇన్‌చార్జి బండి రమేశ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు.
