పాపులర్ సింగర్ కి కొండంత కష్టం

పాపులర్ సింగర్ కి కొండంత కష్టం

పాపులర్ కోక్ స్టూడియో సాంగ్ “కనా యారి” సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాట పాడిన సింగర్ వహాబ్ భుగ్తీ మాత్రం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటీవల బలూచిస్థాన్‌లో సంభవించిన వరదల ప్రభావం ఈ గాయకుని కుటుంబంపైనా పడింది. భారీ వర్షాల కారణంగా వహాబ్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వరదల ధాటికి అతని ఇల్లు నీటిలో మునిగిపోవడంతో.. వహాబ్ జీవితం దుర్భరంగా మారింది.  

అయితే దీనస్థితిలో ఉన్న వహాబ్ భుగ్తీని కోక్ స్టూడియో ఆదుకుంటుందని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఉన్న ఈ గాయకునికి సహాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా మరెంతో మంది అతని ఫొటోలను షేర్ చేస్తూ... కోక్ స్టూడియోను ట్యాగ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో పేరు, ప్రఖ్యాతలు సాధించిన ఈ ప్రతిభావంతునికి వచ్చిన కష్టాన్ని చూసి అభిమానులు తల్లడిల్లుతున్నారు. ఆపత్కాలంలో అతన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.