TRS లోకి పాలేరు ఎమ్మెల్యే కందాల

TRS లోకి పాలేరు ఎమ్మెల్యే కందాల

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల్లో మరో వికెట్ పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు.. ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధం వ్యక్తం చేశారు ఉపేందర్ రెడ్డి.

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా.. ఇప్పటికే ఐదుగురు టీఆర్ఎస్ లో చేరటం ఖాయమైంది. ఇప్పుడు కందాల ఉపేందర్ రెడ్డి కూడా కారెక్కేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, నకిరెకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించారు.