పాలేరులో ఎవరు పోటీ చేసినా వార్ వన్ సైడ్: కందాల ఉపేందర్

పాలేరులో ఎవరు పోటీ చేసినా వార్ వన్ సైడ్: కందాల ఉపేందర్

ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.  బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. అదే నియోజకవర్గం నంచి  సీనియర్ నేత  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.  ఇక వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా పాలేరు నుంచి బరిలోకి దిగుతారనే  ప్రచారం ఉంది. 

ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి..  పాలేరు నుంచి ఎవరు పోటీ చేసినా వార్ వన్ సైడ్ అవుతుందన్నారు . తుమ్మలను టార్గెట్ చేసిన కందాల.. ఆయన  అంశం సీఎం పరిధిలో ఉందన్నారు. తుమ్మల ఓడిపోతే తీసుకొచ్చి మంత్రిని చేయడం అన్యాయమా అని ప్రశ్నించారు. ఏ  సీఎం అయినా ఇంతకంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వలేరన్నారు. 2018లో జిల్లాను అప్పగిస్తే ఒక్క సీటు గెల్వలేదన్నారు.

 పాలేరు నుంచి షర్మిల పోటీ చేసినా తనకు ఇబ్బంది లేదన్నారు కందాల. పార్టీ పెట్టి సీఎం అవుతానన్న షర్మిల..ఇపుడు విలీనం అంటున్నారన్నారు. షర్మిల పోటీ చేస్తే స్వాగతిస్తానన్న కందాల..  పాలేరులో ఎవరు పోటీ చేసినా గెలిచేది బీఆర్ఎస్సేనని చెప్పారు.