బషీర్‌బాగ్, వెలుగు : తమ ప్రాణాలతో చెలగాటమాడుతూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ఓం శివశక్తి కేడియా స్పాంజ్ ఐరన్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని బాధిత గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కందివనం సర్పంచ్ జమిని, ఉపసర్పంచ్ విజయ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కందివనం, మొగిలిగిద్ద శివార్లలో 2004లో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో బతకలేకపోతున్నా మన్నారు. ప్రభుత్వం స్పందించి పరిశ్రమపై చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.
