యూ, వెలుగు : ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్చేయాలని నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గురువారం నిరుద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నిరుద్యోగ జేఏసీ నాయకురాలు ఆస్మా మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
మెగా డీఎస్సీ, డిగ్రీ లెక్చరర్, గురుకుల, అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. టెట్ దరఖాస్తులకు రూ.వెయ్యి ఫీజు వసూలు చేయడం మేనిఫెస్టో హామీలకు విరుద్ధమన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి, జాబ్ క్యాలెండర్ అమలు చేసిన తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 లక్షల మంది నిరుద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులు మూర్తి, ఉదయ్ కుమార్, వెంకట్, రాకేష్, హరీష్, సాయి, పుష్ప పాల్గొన్నారు.
