కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు రోజుల పర్యటన

కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు రోజుల పర్యటన
  • రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

కొడంగల్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఈ నెల 7, 8, 9 తేదీల్లో తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సుమారు రూ.9 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం కడా స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి వెల్లడించారు. 

ఈ నెల 7న హకీంపేటలో నిర్వహించే మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. 8న స్వయం సహాయక సంఘాల మహిళలతో భేటీ అవుతారు. నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తారు.

9న కొత్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ నుంచి నాచారం వరకు..
రూ.5 వేల కోట్లతో నిర్మించనున్న రేడియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. రూ.1,400 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రోడ్ల నిర్మాణం, రూ.2,100 కోట్లతో మక్తల్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-నారాయణపేట -కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు హకీంపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు.