ఎస్టీపీల్లో నీళ్ల శుద్ధిపై రాజీ పడేది లేదు..ప్రతి ఎస్టీపీ వద్ద డిస్‌‌‌‌ప్లే బోర్డులు  : జలమండలి ఎండీ అశోక్రెడ్డి 

ఎస్టీపీల్లో నీళ్ల శుద్ధిపై రాజీ పడేది లేదు..ప్రతి ఎస్టీపీ వద్ద డిస్‌‌‌‌ప్లే బోర్డులు  : జలమండలి ఎండీ అశోక్రెడ్డి 

 హైదరాబాద్ సిటీ, వెలుగు :  ఎస్టీపీల్లో శుద్ధి చేసే నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని జలమండలి ఎండీ అశోక్‌‌‌‌రెడ్డి అన్నారు. జనాలకు సప్లై చేసే నీళ్లు వంద శాతం నాణ్యతతో ఉండాలని అధికారులను ఆదేశించారు.

 క్వాలిటీ లెవెల్స్​ఎలా ఉన్నాయో చూసి ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయాలని సూచించారు. గురువారం నానక్‌‌‌‌రామ్‌‌‌‌గూడ, ఖాజాగూడ ఎస్టీపీలను ఆయన పరిశీలించారు. ప్రతి ఎస్టీపీ వద్ద నీటి నాణ్యత వివరాలు కనిపించేలా ఎలక్ట్రానిక్ డిస్‌‌‌‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీపీ సీజీఎం పద్మజ, జీఎం సుబ్బారాయుడు పాల్గొన్నారు.