న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్ బై

న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్ బై

కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన ప్రకటన చేశాడు. న్యూజిలాండ్ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. పనిఒత్తిడి కారణంగా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొన్నాడు. 

న్యూజిలాండ్ టీమ్ కు 2016లో కేన్ విలియమ్సన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. బ్రండెన్ మెకల్లమ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేన్ విలియమ్సన్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. మొత్తంగా ఆరేళ్ల పాటు కెప్టెన్గా వ్యవహరించాడు. కేన్ నాయకత్వంలో కివీస్ 38 టెస్టులాడింది. ఇందులో 22 మ్యాచుల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ముఖ్యంగా అతని కెప్టెన్సీలోనే గతేడాది న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకోవడం విశేషం.

విలియమన్స్‌ స్థానంలో టెస్టుల్లో టిమ్ సౌథీ న్యూజిలాండ్ కు నాయకత్వం వహించనున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ ఎంపికయ్యాడు. కేన్ విలియమ్సన్..వన్డే, టీ20లకు సారథిగా వ్యవహరిస్తాడు.