క్రికెట్‌‌‌‌ కు న్యూజిలాండ్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ గుడ్‌‌‌‌ బై

క్రికెట్‌‌‌‌ కు న్యూజిలాండ్‌‌‌‌  మాజీ కెప్టెన్‌‌‌‌ కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ గుడ్‌‌‌‌ బై

క్రైస్ట్‌‌‌‌చర్చ్‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌.. ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పాడు. గతేడాది టీ20లకు వీడ్కోలు పలికిన కేన్‌‌‌‌ ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. 16 ఏళ్ల కెరీర్‌‌‌‌లో కివీస్‌‌‌‌ తరఫున 378 మ్యాచ్‌‌‌‌లు ఆడిన విలియమ్సన్‌‌‌‌ 19,346 రన్స్‌‌‌‌ చేశాడు. 110 టెస్ట్‌‌‌‌ల్లో 54 యావరేజ్‌‌‌‌తో 9515 రన్స్‌‌‌‌ సాధించాడు. 

ఇందులో 33 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. 175 వన్డేల్లో 15 సెంచరీలతో కలిపి 7256 రన్స్‌‌‌‌, 93 టీ20ల్లో 2575 రన్స్‌‌‌‌ చేశాడు. కెప్టెన్‌‌‌‌గా కివీస్‌‌‌‌ జట్టును రెండుసార్లు వన్డే ప్రపంచ కప్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌కు, మూడుసార్లు సెమీస్‌‌‌‌కు చేర్చాడు. 2021లో తొలి వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ట్రోఫీని అందించాడు. 2015లో ఐసీసీ క్రికెటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌గా, 2019లో బెస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా అవార్డులను అందుకున్నాడు. ‘వ్యక్తిగత రికార్డుల కంటే న్యూజిలాండ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ జట్టు సాధించిన అభివృద్ధే తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చిందని విలియమ్సన్‌‌‌‌ అన్నాడు. ఇకపై తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నట్లు తెలిపాడు.