ఆసుపత్రిలో అపాయింట్మెంట్..చివరి మ్యాచ్కు కేన్ దూరం

ఆసుపత్రిలో అపాయింట్మెంట్..చివరి మ్యాచ్కు కేన్ దూరం

టీమిండియాతో జరిగే మూడో టీ20కి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. కేన్ విలియమ్సన్ ఆసుపత్రిలో అపాయింట్ మెంట్ తీసుకున్నాడని..అందుకే మూడో టీ20ల్లో కేన్ ఆడటం లేదని..హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. 

మోచెయ్యి సమస్య కాదు...
కేన్ కేన్ విలియమ్సన్ గత కొద్ది కాలంలో మోచెయ్యి సమస్యతో బాధ పడుతున్నాడు. అయితే తాజాగా అతను తీసుకున్న డాక్టర్ అపాయింట్‌మెంట్ మోచెయ్యి సమస్య కోసం కాదని గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు. మూడో టీ20లో కేన్ విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్‌మాన్‌ ఆడనున్నట్లు చెప్పాడు.  మార్క్ అద్భుతమైన ఆటగాడని..చివరగా అతను టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడని తెలిపాడు.

వన్డే సిరీస్లో ఆడతాడు..
చివరి టీ20కి కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమైనా...వన్డేల సిరీస్కు అందుబాటులో ఉంటాడని  గ్యారీ స్టెడ్ వెల్లడించాడు. బుధవారం నాటికి ఆక్లాండ్‌లో జట్టుతో కలుస్తాడని చెప్పాడు.  మరోవైపు రెండో టీ20ల్లో సహచరులు విఫలమైనా..కేన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 52 బంతుల్లో 61 పరుగులు సాధించి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి సహకారం లభించకపోవడంతో ..భారత్ 65 పరుగులు తేడాతో గెలిచింది.