
బాలీవుడ్ హీరోయిన్ కంగనా ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ. 1975 సంవత్సరంలో ఇండియాలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాను కంగనానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. వివావాదాస్పద కథతో వస్తున్న ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూవస్తోంది. ఈనేపధ్యంలోనే తాజాగా ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీని ప్రకటించారు కంగనా.
జూన్ 25 అంటే నేటికి దేశంలో ఎమర్జెన్సీ విధించి సరిగ్గా 49 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సంధర్బంగా ఎమర్జెన్సీ విధించిన అదే రోజున(జూన్ 25) ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు కంగనా. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఎమర్జెన్సీ చీకటిరోజులు అని రాసుకొస్తూ కొత్త పోస్టర్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఎమర్జెన్సీ సినిమా విషయానికి వస్తే.. 1975లో సంవత్సరంలో భారతదేశంలో అప్పటి ప్రధాని ఎమర్జెన్సీ విధించారు. అసలు ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎమర్జెన్సీ తరువాత రాజకీయంగా జరిగిన పరిణామాలు ఏంటి? అనే విషయాన్నీ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు కంగనా. మరి ఇలాంటి వివాదాస్పద కథతో వస్తున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెన్ని వివాదాలను తీసుకొస్తుందో చూడాలి.