ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలే: కంగనా

ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలే: కంగనా

చండీగఢ్/న్యూఢిల్లీ: ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలేనని సినీ నటి కంగనా రనౌత్​ అన్నారు. ఇందుకు వారి ప్రొఫెషన్, బ్యాక్​గ్రౌండ్​తో సంబంధంలేదని చెప్పారు. బీజేపీ అధిష్టానం హిమాచల్​ప్రదేశ్​లోని మండి లోక్​సభ స్థానం నుంచి రనౌత్ ను బరిలోకి దింపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన మహిళా నేత సుప్రియా శ్రీనతే తన సోషల్​మీడియా అకౌంట్లలో రనౌత్​ను కించపరిచేలా పోస్టులు పెట్టారు. సుప్రియాతో పాటు ఆ పార్టీ నేత హెచ్​ఎస్ ​అహిర్​అకౌంట్​లోనూ పోస్ట్​చేశారు. ఈ అంశం కాస్తా తీవ్ర దుమారం రేపింది. ఈ పోస్టుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ చీఫ్​ ఖర్గేను డిమాండ్​ చేశారు. కాగా, అంశంపై కంగనా స్పందించారు. మంగళవారం చండీగఢ్ ఎయిర్​పోర్ట్​లో మీడియాతో మాట్లాడుతూ.. ‘టీచర్‌‌‌‌, నటి, జర్నలిస్ట్, రాజకీయ నేత, సెక్స్‌‌‌‌ వర్కర్‌‌‌‌.. ఏ వృత్తిలో ఉన్నా సరే ప్రతీ మహిళ గౌరవానికి అర్హురాలే. ప్రపంచవ్యాప్తంగా "ఛోటా కాశీ"గా పిలవబడే మండిపై  కాంగ్రెస్​ నేతల నీచమైన వ్యాఖ్యల వల్ల నేను చాలా బాధపడ్డాను” అని కంగన అన్నారు.