బషీర్ బాగ్, వెలుగు : సిక్కుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్న ఎమర్జెన్సీ సినిమాను నిషేదించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీరాబాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్రంట్ చైర్మన్ సనాఉల్లాఖాన్
ప్రతినిధులు ప్రొ.అన్వర్ ఖాన్, డా.సర్జన్ సింగ్ మాట్లాడుతూ... ఎమర్జెన్సీ సినిమాను ప్రదర్శించినట్లయితే జరిగే పరిణామాలను ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఫ్రంట్ లీడర్లు నర్సింగ్ రావు, ఎంఎ.అజీజ్, సలీంఆలీ హిందీ, ఎస్.ఎస్.తన్వీర్ పాల్గొన్నారు.