కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్ వాయిదా

కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్ వాయిదా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం 'ఎమర్జెన్సీ' రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ పొలిటికల్ డ్రామాను 2024కి వాయిదా వేస్తున్నట్టు ఆమె తెలియజేసింది. మొదట్లో, ఈ చిత్రాన్ని నవంబర్ 24, 2023న విడుదల చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం కంగనా రనౌత్ తన లేటెస్ట్ చిత్రం 'తేజస్' విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ ఎయిర్ ఫోర్స్ డ్రామా కాకుండా, పొలిటికల్ డ్రామాగా వస్తోన్న 'ఎమర్జెన్సీ'లోనూ కంగనా కనిపించనుంది. ఈ సినిమాతో ఆమె దర్శకత్వ అరంగేట్రం చేయనుంది. జాతీయ-అవార్డ్ గెలుచుకున్న ఈమె.. ఈ విషయాన్ని X లో పోస్ట్ ద్వారా తెలిపింది. రాబోయే చిత్రానికి సంబంధించి తన మనోభావాలను వివరించింది.

"డియర్ ఫ్రెండ్స్.. నేను ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలనుకుంటున్నాను. ఎమర్జెన్సీ సినిమా అనేది నా జీవితాంతం ఆర్టిస్ట్‌గా నేర్చుకున్న, సంపాదనకు పరాకాష్ట. ఎమర్జెన్సీ అనేది నాకు సినిమా మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా నా విలువ, పాత్రకు పరీక్ష. టీజర్ కు వచ్చిన మమ్మల్ని మరింత ప్రోత్సహించింది. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ఎమర్జెన్సీ విడుదల తేదీ గురించి అడుగుతున్నారు. సినిమా టీజర్‌కు వచ్చిన ఉత్సాహభరితమైన స్పందన సినిమాపై అభిమానుల ఉత్సాహాన్ని నిరూపించాయి. మేము ఎమర్జెన్సీ విడుదల తేదీని నవంబర్ 24, 2023గా ప్రకటించాము. కానీ నా బ్యాక్-టు-బ్యాక్ రిలీజ్ సినిమాలుండడం వల్ల 2024 చివరి త్రైమాసికానికి ఈ మూవీని వాయిదా వేస్తున్నాం. ఎమర్జెన్సీని వచ్చే ఏడాదికి (2024) మార్చాలని నిర్ణయించుకున్నాము. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటించబడుతుంది. దయచేసి మాతో సహకరించండి" అంటూ కంగనా ఎక్స్ లో రాసుకొచ్చింది.

'ఎమర్జెన్సీ' గురించి..

భారతదేశంలో 'ఎమర్జెన్సీ' కాలంలో ఏర్పడిన గందరగోళం గురించి తెలియజేస్తూ జూన్‌లో 'ఎమర్జెన్సీ' కోసం మొదటి టీజర్ ప్రోమోను కంగనా ఆవిష్కరించింది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ వాయిస్‌ఓవర్ అందర్నీ ఆకట్టుకుంది "ఈ దేశాన్ని రక్షించకుండా నన్ను ఎవరూ ఆపలేరు" అనే ఇంట్రస్టింగ్ డైలాగ్‌ ఈ క్లిప్ లో వినిపించింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, దివంగత సతీష్ కౌశిక్, శ్రేయాస్ తల్పాడే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.