
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీడియోల్ కీ రోల్ చేస్తున్నాడు. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ‘మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.
వాటి అన్నింటికన్నా మనది అంతు చిక్కని రహస్యం’ అనే డైలాగ్‌తో ఒక అందమైన దీవిని పరిచయం చేస్తూ ప్రారంభమైన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఆటవిక తెగలతో యుద్ధాలు చేసి వాటిని ఆక్రమిస్తూ.. ఎదురొచ్చిన వారిని క్రూరంగా చంపే విలన్‌గా బాబీ డియోల్ కనిపించాడు. కంగువ పాత్రలో నాయకుడిగా తన సైన్యాన్ని కాపాడుకునే ధీరుడిగా సూర్య కనిపించిన తీరు ఆకట్టుకుంది.
‘మీ రక్తం, నా రక్తం వేరు వేరా.. సిరము, శరీరము వేరై భూమికొరిగెరా.. నుదురు నేల రాలదు.. మొడిమ మోకరిల్లదు.. బానిసత్వం చెల్లదు’ అని ఇంటెన్స్ లుక్‌లో సూర్య చెప్పిన డైలాగ్ ఇంప్రెస్ చేస్తోంది. అలాగే తన మేకోవర్, ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా ఉంది. భారీ నౌకలపై జరిగే యుద్ధ సన్నివేశాలు, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ విజువల్స్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. దసరా కానుకగా అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు.