లవ్ ఎఫైర్‌కు అడ్డున్నాడని తమ్ముడిని చంపిన హీరోయిన్

లవ్ ఎఫైర్‌కు అడ్డున్నాడని తమ్ముడిని చంపిన హీరోయిన్

లవ్ ఎఫైర్‌కు అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడినే చంపింది ఓ అక్క. ఈ అమానుష ఘటన కర్ణాటకలో జరిగింది. కన్నడ చిత్రసీమలో పలు చిత్రాలలో నటించిన షానయ కట్వే.. నియాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం షానయ తమ్ముడు రాకేష్ కట్వేకు ఇష్టంలేదు. ఈ విషయంలో రాకేష్ చాలాసార్లు షానయను హెచ్చరించాడు. దాంతో తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని రాకేష్‌ను అంతమొందించాలని షానయ తన లవర్ నియాజ్‌తో ప్లాన్ చేసింది. అందులో భాగంగా రాకేష్‌ను ఏప్రిల్ 12న షానయ, నియాజ్, అతని కుటుంబసభ్యులు ఇంట్లోనే హతమార్చారు. అనంతరం రాకేష్ మృతదేహాన్ని దేవరాగుడిహాల్ అటవీ ప్రాంతంలో ఒక ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి కాల్చివేశారు.

మృతదేహాన్ని గమనించిన కొందరు వ్యక్తులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఆ డెడ్ బాడీ బార్‌లో హౌస్ కీపర్‌గా పనిచేసే రాకేష్ కట్వేగా గుర్తించారు. దాంతో కేసులో భాగంగా.. షానయను విచారించగా అసలు విషయం బయటపడింది. షానయను, నియాజ్‌ను, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు ధార్వాడ్ పోలీస్ సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తెలిపారు.