
ఇటీవల ‘జైలర్’ చిత్రంలో రజినీకాంత్‌తో స్ర్కీన్ షేర్ చేసుకున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్.. కనిపించింది కొద్దిసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. త్వరలో ‘ఘోస్ట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బీర్బల్’ ఫేమ్ శ్రీని దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం ఈ మూవీ నుంచి ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్’ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ఇందులో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు శివన్న. అర్జున్ జన్య కంపోజ్ చేసిన పాటలో ‘వీరాధి వీరుడీడు..వింటేజ్ వాక్ చూడు.. వేటాడే వేటగాడు.. ఎదురొచ్చే వాడు లేడు.. వచ్చేటి స్టైల్ చూడు’ అంటూ శివరాజ్ కుమార్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా తెలుగు లిరిక్స్‌ను ఎంసీ చేతన్ రాయడంతో పాటు తనే స్వయంగా పాడాడు. హై ఓల్టేజ్ సాంగ్‌లో శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు, మేకింగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.