
మంచు వారి కలల ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa) నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కనున్న కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ (Prabhas) ఫస్ట్ లుక్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే సోమవారం (ఫిబ్రవరి 3న) కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ఓ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ విషయాన్ని కన్నప్ప మూవీ టీమ్ ఇవాళ (జనవరి 27) Xలో అధికారికంగా వెల్లడించింది.
ఈ కొత్త పోస్టర్లో ప్రభాస్ నుదిటన నామాలు, ప్రభాస్ కళ్లు, త్రిశూలం ఉన్న ఓ కొత్త పోస్టర్ అంచనాలు పెంచుతుంది. అంతేకాదు రెబల్ ఫ్యాన్స్లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందులో మంచు విష్ణు భక్త కన్నప్ప పాత్రలో నటిస్తున్నాడు. అయితే, ఫిబ్రవరి 3న ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు పోషించే పాత్ర వివరాలు కూడా ప్రకటించనున్నారు.
అయితే, ఇందులో ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట శివుడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఇటీవలే కన్నప్ప టీమ్ 'శివుడి పాత్రలో' అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో కన్నప్పలో ప్రభాస్ నందిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ తో పాటు కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Here’s a glimpse of the Darling-Rebel Star '???????' in #Kannappa!? ?Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! ? #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8
— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025
ఇకపోతే ‘మహాభారతం’ టీవీ సిరీస్‍ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ 25న ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, శరత్‍కుమార్, దేవరాజ్, ఐశ్వర్య, ముకేశ్ రుషి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ॐ The Eternal Protector ॐ
— Kannappa The Movie (@kannappamovie) January 20, 2025
Unveiling @akshaykumar as *???? ?????'?, a captivating presence of divinity, power, and serenity in #Kannappa?.✨
Dive into the ageless story of unwavering love, devotion, and sacrifice.
Experience the grandeur on the big screen this April… pic.twitter.com/CQlB89EaDQ