వ్యాపారి ఇంట్లో రైడింగ్.. అర్ధరాత్రి దాటిన డబ్బు లెక్కింపు

వ్యాపారి ఇంట్లో రైడింగ్.. అర్ధరాత్రి దాటిన డబ్బు లెక్కింపు

ఉత్తరప్రదేశ్‌లోని ఐటీ దాడుల్లో మొత్తం  రూ.177 కోట్లకుపైగా సీజ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. కాన్పూర్‌‌కు చెందిన పర్‌‌ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో  నిన్న పరోక్ష పన్నుల శాఖ, జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి రైడ్స్ చేశారు. అతడి ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దొరికాయి. ఆ డబ్బు లెక్కించడానికి నిన్న అర్ధరాత్రి దాటిపోయిందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే యూపీలోని కాన్పూర్‌‌తో పాటు గుజరాత్, ముంబై సహా పలు ప్రాంతాల్లో రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫేక్ ఇన్వాయిస్ లు, తప్పుడు అప్పుల లెక్కలు చూపించినట్లు ఆరోపణలు రావడంతో రైడ్స్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇన్వాయిస్‌లు, వే బిల్లులు లేకుండానే మెటీరియల్ సప్లై చేస్తున్నట్లు ఎంక్వైరీలో తేలినట్లు చెప్పారు.

పీయూష్  ఇంట్లో దొరికిన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ డబ్బు దొరికిన సమయంలో అది మొత్తం సుమారు రూ.150 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే లెక్క పూర్తి చేసే సమయానికి రూ.177.45 కోట్లు పట్టుబడినట్లు తేలింది. ఇంత వరకు జీఎస్టీ ఇంటెలిజెన్స్ సోదాల చరిత్రలోనే సీజ్ అయిన భారీ అమౌంట్‌ ఇదేనని అధికారులు చెబుతున్నారు.