
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన 'కాంతార' విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మరో సారి వార్తల్లోకి ఎక్కింది. లోకల్ కల్చర్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ కథాంశంగా తీసిన ఈ సినిమా అనేక ప్రశంసలు అందుకున్నప్పటికీ.. ఈ మూవీలోని అత్యంత బాగా పాపులర్ అయిన థీమ్ సాంగ్ “ వరాహ రూపం”పై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ పాటపై కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు సినీ వర్గా్ల్లో హాట్ టాపిక్ గా మారింది.
‘వరాహ రూపం’ పాటను తమ పాట నుంచి కాపీ చేశారంటూ కేరళకు చెందిన తైకుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ సినిమా విడుదలైనప్పటి నుంచీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ మేరకు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ సాంగ్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని, థియేటర్లు, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు, ఓటీటీ లలో ఎక్కడా ఈ సాంగ్ ను ప్లే చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యూజిక్ బ్యాండ్ తైకుదం బ్రిడ్జ్, మాతృభూమి ప్రింటింగ్ కు ‘వరాహ రూపం’ పాట క్రెడిట్ ఇవ్వాలని కేరళ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నవరసం ట్రాక్ ను కాపీ కొట్టి 'వరాహ రూపం' తీసినట్లు కోర్టు చెప్పింది. దీన్నుంచే నుంచే ప్రేరణ పొంది వరాహరూపం పాటను క్రియేట్ చేసినట్లు మ్యూజిక్ డైరెక్టర్ అంగీకరించారని కోర్టు తెలిపింది. దీంతో 'కాంతార' సినిమాలో మోస్ట్ ఇంట్రస్టింగ్ అండ్ మైమరపించే సాంగ్ 'వరాహ రూపం' సాంగ్ నిషేధించడంతో సినీ అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నట్టు తెలుస్తోంది.