కంటి వెలుగు సూపర్ కార్యక్రమం: ఎంఐఎం ఎమ్మెల్యేలు

కంటి వెలుగు సూపర్ కార్యక్రమం: ఎంఐఎం ఎమ్మెల్యేలు

కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రశంసించారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు స్టాల్ వద్దకు మంత్రి హరీశ్ రావు ఎంఐఎం ఎమ్మెల్యేలను స్వయంగా తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అక్బరుద్దీన్ ఒవైసీ, పాషా ఖాద్రి, ముంతాజ్ ఖాన్ లకు టెస్టులు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉందని ఎంఐఎం ఎమ్మెల్యేలు కొనియాడారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ధి కలుగుతుందని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ ను, మంత్రి హరీష్ రావును అభినందించారు.