- ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో ఘటన
ఖమ్మం, వెలుగు : చనిపోయిన ఓ కోతికి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు జరిపారు. కోతి మూడు రోజుల కింద అస్వస్థతకు గురికాగా స్థానికులు గమనించి దానిని బతికించేందుకు సపర్యలు చేశారు.
అయినప్పటికీ బుధవారం ఆ కోతి చనిపోయింది. దీంతో గ్రామస్తులంతా కలిసి కోతికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా కోతి డెడ్‌బాడీని ట్రాక్టర్‌లో పెట్టి, మహిళలు కోలాటం ఆడుతూ గ్రామంలో ఊరేగింపు జరుపగా.. పలువురు నీళ్లు ఆరబోశారు. అనంతరం స్థానిక దేవాలయం సమీపంలో శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు చేశారు.
