రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కంటి వెలుగు స్క్రీనింగ్

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కంటి వెలుగు స్క్రీనింగ్

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన స్క్రీనింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు స్క్రీనింగ్ గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్‌‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌తో కలిసి హెల్త్‌‌ మినిస్టర్‌‌‌‌ హరీశ్‌‌రావు కంటి వెలుగు క్యాంపులను ప్రారంభించారు. తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 1,500 క్యాంపుల్లో 1,60,471 మందికి కంటి పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందులో 70,256 మందికి కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించారు.

వీరిలో 37,046 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. ఇంకో 33,210 మందికి వారి సమస్యకు తగ్గ అద్దాలు రిఫర్ చేశారు. ఇవి 15 నుంచి 20 రోజుల్లో వారికి అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల్లో 16,533 క్యాంపులు నిర్వహించి, సుమారు కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని సర్కార్ టార్గెట్‌‌గా పెట్టుకుంది.