కమర్షియల్ గ్యాస్ ధర రూ.111 పెంపు

కమర్షియల్ గ్యాస్ ధర రూ.111 పెంపు

న్యూఢిల్లీ:  హోటళ్లు వాడే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను  ప్రభుత్వ చమురు సంస్థలు పెంచాయి. ఢిల్లీలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.111 పెరిగి రూ.1691.50 కు చేరింది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు పెరగడం దీనికి కారణం. 

ఇండ్లలో వాడే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.853 వద్దే స్థిరంగా ఉంది. విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరను చమురు సంస్థలు 7.3 శాతం మేర తగ్గించాయి. ఢిల్లీలో కిలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.7353.75 తగ్గి రూ.92,323.02 కు చేరింది. ఈ నిర్ణయంతో విమానయాన సంస్థల నిర్వహణ భారాలు తగ్గనున్నాయి.  ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన ఈ ధరలను మారుస్తాయి.