ధోనీ రీ ఎంట్రీ చాలా కష్టం.!

ధోనీ రీ ఎంట్రీ చాలా కష్టం.!

టీమిండియా మాజీ కెప్టెన్‌‌ ఎం.ఎస్‌ .ధోనీ ఫ్యూచర్‌ పై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యం లో… లెజెండ్‌ బౌలర్‌ కపిల్‌ దేవ్‌‌ కొత్త సందేహాలు లేవనెత్తాడు. చాలా కాలం ఆటకుదూరంగా ఉంటే రీ ఎంట్రీ బాగా కష్టమవుతుందని మహీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ‘వరల్డ్‌‌కప్‌ తర్వాత ధోనీ క్రికెట్‌ ఆడలేదు. దాదాపు ఆరు నెలలనుంచి అతను ఆటకు దూరంగా ఉంటున్నాడు.కాబట్టి రీ ఎంట్రీ అంత సులువుగా ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఐపీఎల్‌ రూపంలోమహీకి మంచి చాన్స్‌ ఉంది. దీనిని సద్వినియోగం చేసుకుంటే మళ్లీ టీమిండియాలో చోటు సంపాదిం చొచ్చు. బీసీసీఐ నుంచి కూడా పిలుపు అందు కోవచ్చు. ధోనీ ఫామ్‌ లోకి వచ్చినా సెలెక్టర్ల ఆలోచన ఎలా ఉంటుందో కూడా చూడాలి. దేశానికి ఏది మంచిదనుకుంటే వాళ్లు దానివైపే మొగ్గుతారు’అని కపిల్‌ వివరించాడు.

మహీనే బెస్ట్​ కెప్టెన్​‌‌: రోహిత్

​టీమిండియా మోస్ట్‌‌ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌‌.. మహేంద్రసింగ్‌ ధోనీయే అని హిట్‌ మ్యాన్‌‌ రోహిత్‌ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా.. ప్రశాంతంగా ఉండటం వల్లే అనితర సాధ్యమైన విజయాలు సాధించాడనన్నాడు. ఇదే మహీ గొప్పతనమని చెప్పాడు. ‘ధోనీ ఎలా ఉంటాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రశాంతంగా ఉండటం వల్లే స్థిరమైన గొప్ప నిర్ణయాలు తీసుకోగలిగాడు. అందుకే మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచాడు. ఎన్నో ఐపీఎల్‌ టైటిల్స్‌ కూడా అతని సొంతమయ్యాయి. అందుకే ధోనీ బెస్ట్‌‌ కెప్టెన్‌‌. ఒత్తిడి పరిస్థితుల్లోనూ చాలా కామ్‌ గా, కూల్‌ గా పని చేసుకుపోతాడు. గ్రౌండ్‌ లో యువ బౌలర్లు ఒత్తిడికిలో నైతే వాళ్లలో ధైర్యాన్ని నింపుతాడు. బంతులు ఎలా వేయాలో చెబుతాడు. వాళ్లలో ఒకడిగా కలిసిపోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగి మంచి పెర్ఫామెన్స్‌ చూపెడతారు’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.