లండన్‭లో కపూర్ సిస్టర్స్ షాపింగ్

లండన్‭లో కపూర్ సిస్టర్స్ షాపింగ్

బాలీవుడ్‭లో స్టార్ హీరోయిన్స్ అయిన కపూర్ సిస్టర్స్ కరీనాకపూర్, కరీష్మాకపూర్ లండన్‭లో ఎంజాయ్ చేస్తున్నారు. సినీ ప్రేక్షకులకు వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షూటింగ్స్‭లో ఎంత బిజీగా ఉన్నా.. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ అప్ డేట్స్‭ను ఇన్ స్టా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు.   అక్కచెల్లెళ్లుగా వీరిద్దరూ కలిసి మెలిసి ఉండటం చూస్తే.. ఎవరికైనా ముచ్చటగా ఉంటుంది. 

కరీనా ప్రస్తుతం లండన్‭లో హన్సల్ మెమతా ప్రాజెక్టు షూటింగ్‭లో ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుని మిగిలిన సమయంలో తన సోదరి కరిష్మాతో కలిసి షాపింగ్ చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు. ఇద్దరూ ఒకేలా నల్లటి దుస్తులను ధరించి.. లిఫ్ట్‭లో ఫోజులు ఇస్తూ కనిపించారు. అలాగే.. హోటల్ వాష్ రూమ్‭లో మేకప్ వేసుకుంటూ మరో ఫోటో దిగారు..  ప్రస్తుతం ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కరీనా తన ఇన్ స్టాలో పంచుకున్నారు. అంతకుముందు.. ఆమె షూటింగ్ తర్వాత చిన్నకొడుకు జెహ్‭తో పార్క్‭లో సమయం గడిపిన ఫోటోను షేర్ చేశారు.