
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్(Karan johar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధర్మ ప్రొడక్షన్స్(Dharma productions) ద్వారా సినిమాలు నిర్మిస్తూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అంతేకాదు.. హోస్ట్ గా కూడా ఆయన అందరికీ సుపరిచితమే. కరణ్ జోహార్ హోస్ట్ గా చేసే కాఫీ విత్ కరణ్(Coffee with karan) అనే షోకు ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే తాజాగా ఆయన సోషల్ మీడియా థ్రెడ్(Thread) లో అడుగుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన తన ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించారు. ఆస్క్ కరణ్.. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. ఇంకో పదినిమిషాలు నేను థ్రెడ్ లో ఉంటాను అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు ఒక నెటిజన్ మీరు "గే" కదా అని అడిగాడు. దానికి సమాధానంగా కరణ్ నీకు చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా అంటూ" కామెంట్ చేశారు. ప్రస్తుతం కరణ్ జోహార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.