నార్త్ ఇండియా తారలు.. టాలీవుడ్ ఎంట్రీ?

నార్త్ ఇండియా తారలు.. టాలీవుడ్ ఎంట్రీ?

హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కరీనా కపూర్ ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు కావస్తోంది. ‘క్రూ’ లాంటి చిత్రాలతో ఇప్పటికీ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మెప్పిస్తోందామె. ఇన్నేళ్ల లాంగ్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందీ చిత్రాల్లో మాత్రమే నటించిన కరీనా ఇప్పుడు సౌతిండియన్ సినిమాలపై కూడా ఫోకస్ పెడుతోంది.  ఇప్పటికే తన భర్త సైఫ్ అలీ ఖాన్..  ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరీనా ఓ టాలీవుడ్ సినిమాకు సైన్ చేసినట్టు బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాక్.  ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఈ వరుసలో వినిపిస్తున్నాయి. 

అందులో ఒకటి మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రం.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’తో అలియాభట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకున్న రాజమౌళి.. ఈసారి కరీనాకు చాన్స్ ఇవ్వనున్నాడనే టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సినిమాలోనూ కరీనా కపూర్ పేరు వినిపిస్తోంది.  అంతేకాదు ఇందులో విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కరీనా భర్త సైఫ్ పేరు ప్రచారంలో ఉంది. టాలీవుడ్ నుంచి తెరకెక్కనున్న ఈ రెండు ప్రెస్టేజియస్ పాన్ ఇండియా సినిమాల్లో కరీనా ఎందులో నటించనుందో చూడాలి!