మర్డర్ ఇన్వెస్టిగేషన్

మర్డర్ ఇన్వెస్టిగేషన్

‘క్రూ’ తర్వాత కరీనా కపూర్ నుంచి రాబోతున్న చిత్రం ‘ది బకింగ్‌‌‌‌హమ్ మర్డర్స్.  హన్సల్ మెహతా ఈ ఇంటెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌కు దర్శకుడు.  సోమవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 13న  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఏక్తాకపూర్‌‌‌‌‌‌‌‌,  శోభా  కపూర్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరీనా కపూర్  కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తోంది. ఇంగ్లాండ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో  రిమోట్ కమ్యూనిటీలో జరిగిన మర్డర్‌‌‌‌‌‌‌‌ కేసును ఛేదించే  డిటెక్టివ్‌‌‌‌ కాప్‌‌‌‌గా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కరీనా కపూర్‌‌‌‌‌‌‌‌ నటించింది.  లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌,  ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌ సహా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌‌‌లో ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.