
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీ స్కూళ్లలోనూ ప్రాథమిక విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే అన్నారు. సిటీలోని కోతిరాంపూర్ సెక్టార్ పద్మశాలీ స్ట్రీట్ అంగన్‌వాడీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శుక్రవారం సభ, పోషణమాసం కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలను శుక్రవారం సభ దృష్టికి తీసుకురావచ్చన్నారు. డీఎంహెచ్‌వో
మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మహిళలకు 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సిటీలోని హౌసింగ్ బోర్డు పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. కార్యక్రమంలో పీవో ఎంహెచ్ఎన్ సనా జవేరియా, డాక్టర్ ప్రణవ్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.