తిమ్మాపూర్, వెలుగు: పెండ్లిలో పోలు పోసి తన వృత్తిని విలువ చాటాడు కరీంనగర్బల్దియా అలుగునూర్ కార్పొరేటర్కాల్వ మల్లేశం. గ్రామానికి చెందిన పోరండ్ల సింగిల్‌విండో మాజీ చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి -– శ్యామల దంపతుల చిన్న కొడుకు నిఖిల్‌రెడ్డి వివాహం బుధవారం ఓ ఫంక్షన్ హాలులో జరిగింది.
ఈ వేడుకలో కార్పొరేటర్ కాల్వ మల్లేశం(రజక కులం) సంప్రదాయాలకు విలువనిస్తూ లగ్గానికి పోలు పోశారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న కార్పొరేటర్‌ను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.
