కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఆధునీకరించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆఫీస్‌లో ప్రత్యేక పూజలు చేసి, నూతనంగా తీర్చిదిద్దిన విభాగాలను పరిశీలించారు. గతంలో ఈ భవనం పైఅంతస్తులో ఉన్న సీసీఎస్(సీసీఎస్) పీఎస్‌ను రూరల్ ఏసీపీ ఆఫీస్ ఆవరణలోకి మార్చారు. దీంతో మొత్తం భవనాన్ని టూ టౌన్ పీఎస్ అవసరాలకు కేటాయించారు.
స్టేషన్‌లో సిబ్బంది పెరగడం, ముఖ్యంగా మహిళా పోలీసుల సంఖ్య పెరగడంతో వారి కోసం ప్రత్యేకంగా రెస్ట్ రూమ్, ఇతర మౌలిక వసతులను కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడం వల్ల మరింత ఉత్సాహంగా పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, సీఐ సృజన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
