
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-1, -2, -3,-4, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్.. తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మంతెన రవికుమార్ మంగళవారం తెలిపారు.
5 నెలల పాటు నిర్వహించనున్న ఈ కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1000 స్టెఫండ్ అందజేయనున్నట్టు తెలిపారు. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌కు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16నుంచి ఆగస్టు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 0878- 2268686 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
సిరిసిల్ల స్టడీ సర్కిల్‌లో..
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలోని బీసీ స్టడీ సర్కిల్‌లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాజన్నసిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి తెలిపారు. కు ఈనెల 16 నుంచి ఆగస్టు 8 వరకు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 0872 3-223004, 93818 88746లో సంప్రదించాలని సూచించారు.