న్యాయ పోరాటం : కళ్లకు గంతలతో కలెక్టరేట్ దగ్గర నిరసన

న్యాయ పోరాటం : కళ్లకు గంతలతో కలెక్టరేట్ దగ్గర నిరసన

కరీంనగర్ : సమస్యల కోసం రోడ్డెక్కావారిని చూశాం కానీ.. రోడ్డు కోసమే ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన చేపట్టాడు. పాడైపోయిన రోడ్డును తక్షణమే బాగు చేయాలని కళ్లకు గంతలు కట్టుకుని జిల్లా కలెక్టర్ వద్దకు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ సంఘటన కరీంనగర్ లో శనివారం జరిగింది. స్థానిక విద్యానగర్ నుండి శాతవాహన యూనివర్సిటీకి వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. దీనిపై కోట శ్యామ్ కుమార్ అనే సామాజిక కార్యకర్త ఇప్పటికే స్థానిక అధికారులకు చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు శ్యామ్ కుమార్. విద్యానగర్ నుండి కలెక్టరేట్ వరకు కళ్లకు గంతలు కట్టుకొని కాలినడకన కలెక్టరేట్ వరకు చేరుకున్నాడు. రోడ్లను వెంటనే బాగు చేయాలని కలెక్టరేట్ వద్ద తన నిరసన కార్యక్రమాలు తెలియజేశాడు.