
కరీంనగర్ : ఒక్క రూ పాయికే అంతిమ యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్. పేదలకు అంత్యక్రియలు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు సామాజిక దృక్ఫథంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు మేయర్. నగరపాలక సంస్థ ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాన్ని అంతిమయాత్ర, ఆఖిరీ సఫార్ పేరుతో చేపడుతున్నట్లు గత నెల 20న నగర మేయర్ ప్రకటించగా.. దీని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం రెండు వాహనాలకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు మేయర్ రవీందర్ సింగ్.